● ప్రారంభమైన ఏపీఈఏపీసెట్ పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఏపీఈఏపీసెట్– 2026 పరీక్షల పర్వం మంగళవారం మొదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల్లో భాగంగా రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి ఐదు రోజులపా టు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు పరీక్షలు జరుగుతుండగా.. తొలిరోజు రెండు సెషన్లకు కలిపి 1440 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 1395 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 45 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌కు 720 మందికి 693 మంది, మధ్యాహ్నం సెషన్‌కు 720 మందికిగాను 702 మంది ఆన్‌లైన్ పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో నాలుగు కేంద్రా ల్లో పరీక్షలు జరుగుతున్నాయి. చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ, టెక్కలిలోని ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాలల కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి.


