శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రభు త్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జాబితాలను సిద్ధం చేసి, డీఈఓ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. భవిష్యత్‌లో చేపట్టే బదిలీలు, పదోన్న తులు తదితర ప్రక్రియలన్నీ ఈ జాబితా ఆధారంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఉపాధ్యాయులు ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ధ్రువీకరణ పత్రాలతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని ఆయన వెల్లడించారు.


