నరసన్నపేట: వంశధార నదీ తీరాన ఉన్న మడపాంను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డా రు. ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉందని, ఇప్పటికే రోజూ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు. మంగళవారం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మడపాం వద్ద ఉన్న విశ్వవిరాట్ వీర హనుమాన్ దేవస్థానంలో వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధిలు తంగుడు జోగారావుతో పాటు స్థానికులు రువ్వ వాసుదేవరావు, మారెళ్ల అప్పలనాయుడు తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


