పలాస: పలాస జీడిపిక్క బొమ్మ ఎదురుగా ఉన్న డిలైట్ ఫొటో స్టూడియోలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. యజమాని బొంతల రమేష్ షాపును మూసేసి వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి వచ్చే సరికి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చాడు. పలాస అగ్నిమాపక అధికారి బి.సోమేశ్వరరావు, లీడింగ్ ఫైర్ ఆఫీసర్ రవికుమార్, రాము, లోకనాధం తదితరులు మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5లక్షలు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి బి.కోటేశ్వరరావు తెలిపారు.
చిన్నమ్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు
సారవకోట: బుడితి సీహెచ్‌సీలో హెడ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న సొమలపురి చిన్నమ్మి మంగళవారం నర్సుల దినోత్సవం పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు ప్రభుత్వం గుర్తించి గుంటూరులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 1992 నుంచి ఈమె నర్సుగా విధులు నిర్వర్తిన్నారు. ఈమెను సీహెచ్‌సీ సూపరింటెండెంట్ చైతన్య, వైద్యులు, సిబ్బంది అభినందించారు.
యూరియా, డీఏపీ అమ్మకాలు నిషేధం
రణస్థలం : ఉన్నతాధికారుల ఆదేశాలు నేపథ్యంలో యూరి యా, డీఏపీ నిల్వ ఉన్నా అమ్మకాలు జరపరాదని రణస్థలం వ్యవసాయాధికారి డి.విజయభాస్కర్ షాపుల నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మండలంలోని పలు ఎరువులు, పురుగు మందుల, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ యూరియా, డీఏపీ స్టాప్ సెల్ ఆదేశాలు జారీ అయ్యాయని, అమ్మినవారు శిక్షార్హులని హెచ్చరించారు. కొత్తగా ఎరువులు స్టాక్ వచ్చినా వ్యవసాయాధికారికి తెలియజేయాలన్నారు. స్టాక్ రిజిస్టర్ అప్‌డేట్‌గా ఉంచాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్టాక్ వివరాలు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఆఫీస్ టెక్నికల్ జి.సుహాసిని, ఏఈవో ఎం.సునీత, వై.రాజశేఖర్ పాల్గొన్నారు.
చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధి
జి.సిగడాం: ప్రతి మహిళా ఆర్థికాభావృద్ధి సాధించాలని డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్ అన్నా రు. నిద్దాంలో కొరమీను చేపల పెంపకం యూనిట్‌ను మంగళవారం పరిశీలించారు. యూని ట్ ఆదాయం, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పైల కోటేశ్వరమ్మ, ఏపీఎం రెడ్డి రామకృష్ణంనాయుడు, సీసీ లక్ష్మి, బాబ్జీనాయుడు, రామకృష్ణ పాల్గొన్నారు.


