టెక్కలి రూరల్: మండలంలోని మునసబుపేట సమీప రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి చిన్నచాకలి వీధికి చెందిన వెగులాడ ధర్మారావు (52) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ధర్మారావు టెక్కలిలోని ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్ట్ పరిధిలో కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు నిమిత్తం వెళ్లిన ఆయన నౌపడ వైపు వెళ్లి తిరిగి తన ద్విచక్రవాహనంపై టెక్కలి వైపు వస్తుండగా ముసనబుపేట సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ధర్మారావు తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ధర్మారావుకు భార్య కేసవమ్మ, కుమార్తె షర్మిల ఉన్నారు.


