ఆమదాలవలస: సైలాడ పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు సైలాడ దాసునాయుడు ఇటీవల గుండెపోటుతో మృతిచెందడంతో కుమ్మరిపేటలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య సోమవారం పరామర్శించారు. దాసునాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మృతికి గల కారణాలు అడిగి తెలుకున్నారు. వారితో పాటు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, నాయకులు గొండు కృష్ణమూర్తి, సురవరపు నాగేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, బెవర మల్లేశ్వరరావు, పొడుగు శ్రీనివాసరావు, బోర చిన్నంనాయుడు, ఇసాయి వెంకటరావు, కింజరాపు సురేష్, పొన్నాడ చిన్నారావు, ఎన్ని రామచంద్రరావు, మొండేటి కూర్మారావు, మజ్జి నాగేశ్వరరావు, బొడ్డేపల్లి మన్మధరావు, పున్నపురెడ్డి తవిటినాయుడు తదితరులు ఉన్నారు.


