ఎస్పీ గ్రీవెన్స్‌కు 62 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ గ్రీవెన్స్‌కు 62 ఫిర్యాదులు

May 12 2026 12:32 AM | Updated on May 12 2026 12:32 AM

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)లో బాధితుల నుంచి 62 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

● ఆమదాలవలస ఎస్‌ఐపై బెలమాం గ్రామానికి చెందిన ఆబోతుల వసంతమ్మ ఎస్పీ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇండక్షన్‌ ఆర్డర్‌ పట్టుకుని తమ భూమి వద్దకు వెళ్లామని.. అవతలి వ్యక్తులు తమనేం చేయలేక పంటతో ఉన్న భూమిని మేం కాల్చేశామని ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారన్నారు. ఎటువంటి ఆధారం లేకపోయినా దాన్ని ఫిర్యాదుగా స్వీకరించిన ఎస్‌ఐ తమపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement