● ఒక ఫ్యామిలీ.. నాలుగు హెల్మెట్లు | - | Sakshi
Sakshi News home page

● ఒక ఫ్యామిలీ.. నాలుగు హెల్మెట్లు

May 12 2026 12:32 AM | Updated on May 12 2026 12:32 AM

జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కలిపి మొత్తం నలుగురు హెల్మెట్లు ధరించి ప్రయాణం సాగిస్తూ సోమవారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులకు కనిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నలుగురు ఒకే వాహనంపై కనిపించినా.. అందులో ఇద్దరు పిల్లలుండటంతో ఇలా ఇరుకుగా రాకూడదని అవగాహనపరుస్తూనే హెల్మెట్లు పెట్టి రావడం అభినందనీయమని ట్రాఫిక్‌ సీఐ వి.రామారావు ప్రశంసించారు. నగరంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న రమేష్‌ వినూత్న మార్పుకు నాంది పలికారని, వాహనదారులంతా హెల్మెట్‌ ధారణలో రమేష్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. – శ్రీకాకుళం క్రైమ్‌

Advertisement
 
Advertisement
Advertisement