శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా సోమవారం జరిగిన ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై నవారిలో దీక్షా బెహరా, ప్రీతమ్‌రాజ్, అవినాష్ ఉన్నారు. వీరు ఈ నెల 24న కర్నూలులోని డీఎస్‌ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అద్యక్షుడు కేఎన్‌ఎస్‌వీ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు, ఎస్.కాంతారావు, కోచ్ మురళీధర్, సూర్యారావు, రాధాకృష్ణ పాల్గొన్నారు.


