సేవాభావంతో.. | - | Sakshi
Sakshi News home page

సేవాభావంతో..

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

సేవాభావంతో.. జాగ్రత్తలు పాటించాలి..

రెండు నెలలు క్రితం నేను ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో నైట్‌ డ్యూటీలో ఉండగా, రాత్రి సమయంలో ఏడాదిన్నర బాబును తల్లిదండ్రులు ఏడుస్తూ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఫిట్స్‌ రావడంతో పూర్తిగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆ పిల్లాడ్ని చూస్తే నా ఏడాది కొడుకు గుర్తుకు వచ్చాడు. వెంటనే వైద్యం అందించా. ఇంజక్షన్‌ చేసి తెల్లారేవరకు ఆ పిల్లాడిని కంటికి రెప్పలా సపర్యలు చేశాను. బాబు కోలుకున్నాక ఆ తల్లిదండ్రులు నాపై చూపిన కృతజ్ఞతకు పులకించిపోయాను. నా భర్త సీఐఎస్‌ఎఫ్‌లో జాబ్‌ చేస్తుండటంతో పలుమార్లు నన్ను ఉద్యోగం మానేయాలని చెప్పారు. అయితే తోటి వారికి సాయం చేసే అమూల్యమైన ఉద్యోగాన్ని వదిలేయాలనిపించలేదు.

– సీహెచ్‌.నాగశ్రీ, స్టాఫ్‌ నర్సు, ఇచ్ఛాపురం

రోగులకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నేను డ్యూటీ నర్సు కావడంతో ట్రీట్‌మెంట్‌ చేయాల్సి వచ్చింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశాను. చికిత్స అందిస్తుండగా నా చేతిలోనే మృతి చెందాడు. ఆ సమయంలో నిస్సహాయ స్థిఽతిలో ఉండిపోయాను. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం మూలంగా మృతి చెందాడు. ఇప్పటి కుర్రాళ్లు ప్రయాణాలు చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించడం లేదు.

– బి.రూపావతి, స్టాఫ్‌ నర్స్‌, ఇచ్ఛాపురం

Advertisement
 
Advertisement
Advertisement