పల్లకిలో పెళ్లికూతురు | - | Sakshi
Sakshi News home page

పల్లకిలో పెళ్లికూతురు

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

సీహెచ్‌ కపాసుకుద్ధిలో విశ్వశాంతి మహాయజ్ఞంలో భాగంగా నిర్వహించిన తారకనామమంత్ర పారాయణ సహిత నామయజ్ఞం ఆదివారంతో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆదివారం విశ్వశాంతి మహాయజ్ఞంలో భాగంగా ఏర్పాటుచేసిన పూర్ణకుంభాలు, యజ్ఞకుండంలో మిగిలిన పదార్థాలను సమీపంలోని సముద్ర జలాల్లో నిమజ్జనం చేసే శోభాయాత్ర వేడుకగా జరిపించారు. – కవిటి
కాలం మారింది. వివాహ పద్ధతులు మారిపోయాయి. ఆనాటి సంప్రదాయాలన్నీ కనుమరుగైపోయాయి. అలాంటిది ఓ పల్లెలోని పెళ్లిలో పల్లకీ మళ్లీ కనిపించింది. అంతరించిపోతున్న సంప్రదాయాన్ని ముచ్చటగా తట్టి లేపింది. ఆదివారం ఎస్‌పిఆర్‌పురం–చీపురుపల్లి, జి.సిగడాం–పొగిరి గ్రామాల్లో వివాహ వేడుకల్లో పెళ్లి కూతుళ్లను పల్లకిలో ఊరేగించారు. – జి.సిగడాం

పల్లకిలో పెళ్లికూతురును

ఊరేగిస్తున్న దృశ్యం (ఇన్‌సెట్లో) ఎస్‌పీఆర్‌పురం గ్రామంలో పల్లకిలో కూర్చున్న పెళ్లి కూతురు

Advertisement
 
Advertisement
Advertisement