20 నుంచి పాఠశాల, కళాశాల బస్సులు తనిఖీ | - | Sakshi
Sakshi News home page

20 నుంచి పాఠశాల, కళాశాల బస్సులు తనిఖీ

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

శ్రీకాకుళం రూరల్‌: ఈ నెల 20 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన బస్సులను తనిఖీ చేస్తామని ఉపరవాణా శాఖాధికారి ఎ.విజయసారథి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర రవాణా కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని స్కూల్స్‌, కాలేజీ బస్సులను ఆంధ్రప్రదేశ్‌ మోటారు వాహనాల చట్టం అనుసరించి రహదారి భద్రత నిబంధలను అనుస రించి తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా బస్సు నిర్వహణ, బస్సు ఫిట్‌నెస్‌, పర్మిట్‌, పన్ను విధానం, అత్యవసర నియమాలు, వేగ నియంత్రణ పరికరాలు, డ్రైవర్‌కు సంబంధించిన లైసెన్స్‌, బ్యాడ్జి బస్సు పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. జిల్లాలోని 5 బృందాలుగా ఏర్పరచి ప్రతి రోజు తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా 614 స్కూల్‌, కాలేజీలకు సంబంధించిన బస్సులు ఉండగా ఇంతవరకూ 173 బస్సులను తనిఖీ చేసినట్లు తెలిపారు. వీటిలో 49 బస్సులకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్పు అవసరమన్నారు. ఆయా యాజమాన్యాలను స్పంచింది వెంటనే స్కూల్‌ కాలేజీ బస్సులను వెంటనే తనిఖీలు చేపట్టాలని డీటీసీ కోరారు.

16న ముఖ్యమంత్రి పర్యటన

నరసన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న నరసన్నపేట మండలంలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. మండలం జమ్ము కూడలి, తామరాపల్లిల వద్ద ఉన్న హెలీప్యాడ్‌ స్థలాలను ఆయన అధికారులతో కలసి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొంటారని అన్నారు. ఆయన వెనుక ఇన్‌చార్జి ఆర్డీఓ వేణుగోపాలరావు, ఆర్‌అండ్‌బీఈఈ తిరుపతిరావు, డీఎస్పీ లక్ష్మణరావు, తహసీల్దార్‌ సత్యనారా యణ ఉన్నారు. ఇప్పటికే నరసన్నపేట మేజరు పంచాయతీలో పారిశుద్ధ్య పనులను చురుగ్గా చేపడుతున్నారు. రోజుకు 200 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను వినియోగిస్తున్నారు.

‘లేబర్‌ కోడ్లు రద్దు చేయాలి’

రణస్థలం: కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మన్నాయుడు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు, సంస్థలకు ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగు లేబర్‌ కోడ్స్‌ రూల్స్‌ అమలులోకి తేవడాన్ని వ్యతిరేకిస్తూ, లేబర్‌ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఆదివారం పైడిభీమవరం పారిశ్రామికవాడలో లేబర్‌ కోడ్స్‌ రూల్స్‌ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయాలనుకుంటే ఆ ప్రభుత్వాలే పతనం అవుతాయని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీస వేతనం వెంటనే సవరించి కనీస వేతనం రూ. 26వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

రైల్వే గేటును ఢీకొట్టిన వాహనం

వజ్రపుకొత్తూరు రూరల్‌: పలాస–కాశీబుగ్గలో గల రైల్వే ఎల్‌సీ గేటును ఆదివారం ఓ ప్రైవేట్‌ వాహనం ఢీ కొట్టడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సుమారు గంట కాలం పాటు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు, రైల్వే సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు.. రైల్వే గేటు వేస్తున్న సమ యంలో తొందరగా గేటును దాటే ప్రయత్నంలో వాహనం అతివేగంగా వెళ్లి ఎల్‌సీ గేటును బలంగా ఢీ కొట్టింది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి సిబ్బంది సాయంతో ప్రత్యా మ్నాయంగా తాత్కాలిక గేటును ఏర్పాటు చేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులు చేపట్టేందుకు దాదాపుగా గంట సమయం పట్టడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. అలాగే ద్విచక్రవాహనదారులు మండుటెండతో చాలా ఇబ్బంది పడ్డారు. అలా గే కొంత మంది ప్రయాణికులు బస్సులు, ఆటోలను దిగి అక్కడ నుంచి వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement