కిక్కిరిసిన కాంప్లెక్స్‌ | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన కాంప్లెక్స్‌

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

జిల్లాకేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆదివారం ప్రయాణికులతో కిక్కిరిసింది. పిల్లలకు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా జనాలు ప్రయాణాల బాట పట్టడంతో బస్సులన్నీ రద్దీగా కనిపించాయి. ఈ నెల 13 తర్వాత మూఢం రానుండటంతో వివాహ, గృహప్రవేశ ముహూర్తాలు ఇప్పుడే ఎక్కువగా జరుగుతుండటంతో జనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వారితో నాన్‌స్టాప్‌ కౌంటర్‌ కిక్కిరిసిపోయింది. కాంప్లెక్స్‌కు చేరుకున్న బస్సుల్లో సీట్లు సాధించేందుకు.. ముఖ్యంగా ఉచిత బస్సుల్లో సీట్ల కోసం మహిళలు ఎగబడ్డారు.

– శ్రీకాకుళం అర్బన్‌

Advertisement
 
Advertisement
Advertisement