దూసి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కేరింతలు కొడుతూ తమ చిన్ననాటి అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. మాతృదినోత్సవం రోజున ఈ ఆత్మీయ సమావేశం జరగడం ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. – ఆమదాలవలస


