న్యూస్‌రీల్
కిక్ కొడితే పతకమేబాక్సింగ్‌లో చైతన్య రాణిస్తున్నాడు. యూత్ బాక్సింగ్ పోటీలో అదరగొట్టాడు. –8లో
కక్ష గట్టి.. గొంతు కోసి పలాసలో దారుణం జరిగింది. కక్ష గట్టి ఓ వ్యక్తి మృతి చెందారు. –8లో
ఆమె కొట్టినా ఆనందమే.. ఆమె తిట్టినా సంతోషమే.. అమ్మ ఏం చేసినా పిల్లలకు ముచ్చటే. ఇళ్లంటే అమ్మ గాజుల చప్పుడు వినిపించాలి. ఇళ్లంటే ఆమె అడుగుల సవ్వడి తెలుస్తూ ఉండాలి. మాతృత్వం అంటే ఈ లాలిత్యం ఒక్కటే
కాదు. బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా దేశ రక్షణకు పంపించే
తల్లులు ఉన్నారు. వారసుడికి ప్రాణాపాయం ఉందని తెలిసి
అవయవాన్ని దానం చేసిన మాతృమూర్తులు ఉన్నారు. కన్నపేగు
అడుగుల కదలికలు లయబద్ధం చేసి నుదుటి రాతను మార్చిన
అమ్మలూ ఉన్నారు. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం.
మమతల మాలలు అల్లుతూ ప్రతి ఇంటినీ పచ్చగా
చూసుకుంటున్న అమ్మకు జేజేలు పలకాల్సిన రోజు.
– ఇచ్ఛాపురం రూరల్, టెక్కలి, శ్రీకాకుళం కల్చరల్,
జి.సిగడాం, వజ్రపుకొత్తూరు రూరల్
ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన ఈమె పేరు బుడత లోలమ్మ. ఇద్దరు మగ పిల్లలు పుట్టాక పెంచి ప్రయోజకుల్ని చేయాల్సిన భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న లోలమ్మ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించారు. తన ఇద్దరు కొడుకుల్ని సైన్యంలో చేర్పించాలన్న ఆమె కోరికను పిల్లలు ముందుంచారు. పెద్దబ్బాయి దివాకర్, చిన్నబ్బాయి ఢిల్లీరావులు పదో తరగతి నుంచే తమ తల్లి సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేశారు. 2014లో పెద్ద కొడుకు జైలర్‌గా, 2015లో చిన్నకొడుకు ఇండియన్ ఆర్మీలో సోల్జర్‌గా ఎంపికయ్యారు. గత ఏడాది ఆపరేషన్ సింధూర్‌లో ఢిల్లీరావు పాల్గొనగా, తల్లి లోలమ్మ దేశ రక్షణ కో సం పోరాడాలంటూ పిలుపునివ్వడం విశేషం. దేశానికి సేవ చేస్తున్న తన ఇద్దరు కుమారుల్ని చూసి ఇప్పుడు తల్లి లోలమ్మ గర్వపడుతోంది.
ఓ తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి ఆయుష్షును పెంచారు. టెక్కలి రెడ్డికవీధికి చెందిన పిలక దుర్గారావుకు కిడ్నీ పాడై పోవడంతో, ఎవరైనా కిడ్నీ దానం చేస్తే మళ్లీ ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పడంతో, 2013లో తల్లి ఆరుద్రమ్మ తన కిడ్నీని కుమారుడికి ఇచ్చి ఆయుష్షును పెంచారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం చక్కగా ఉంది.
తల్లి లోలమ్మ
ఎస్‌ఎన్.పుట్టుగ గ్రామానికి చెందిన ఈమె పేరు బొట్ట జానకమ్మ, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం ఈమెది. ఈమె పెద్ద కొడుకు కృష్ణారావు ఆరేళ్ల క్రితం పంజాబ్ ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు రాజేష్ ఇండియన్ కోస్ట్ గార్డ్‌గా రెండున్నరేళ్ల కిందట పాండిచ్ఛేరిలో నేవీలో చేరారు. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు కొడుకులు దేశ రక్షణ విధుల్లో చేరడం, ఎంతటి విపత్కర పరిస్థి తులు ఉన్నా దేశం తమకు ముందు అని వారు చెబుతుండటం తల్లిగా తనకు గర్వంగా ఉంటుందని జానకమ్మ చెబుతున్నారు. ‘దేశ సేవలో మేము ఉన్నాం...కానీ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన అసలు సైనికురాలు మా అమ్మే, ఆమె త్యాగం, ప్రేమ, ఆశీర్వాదం వల్లే ఈ యూనిఫాం గౌరవంగా ధరించగలుగుతున్నాం’ అంటూ ఉప్పొంగిపోతున్నారు ఈమె కుమారులు కృష్ణారావు, రాజేష్‌లు.
తల్లి జానకమ్మతో కుమారులు కృష్ణారావు, రాజేష్
తల్లి సరోజిని


