నియామక నోటిఫికేషన్‌ ఉప సంహరణ | - | Sakshi
Sakshi News home page

నియామక నోటిఫికేషన్‌ ఉప సంహరణ

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

నియామక నోటిఫికేషన్‌ ఉప సంహరణ వర్సిటీలో వేధింపులపై విచారణ ‘జీవులపై దయ చూపాలి’ ‘వేసవిలో టీచర్లపై పని ఒత్తిడి సరికాదు’ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాల యం కార్య నిర్వాహక మండలి తీర్మానం, ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్‌ నంబర్‌ 60 ఉత్తర్వుల ప్రకారం బీఆర్‌ఏయూలో ఖాళీగా ఉన్న 98 అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్న ట్లు రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య తెలిపారు. సదరు పోస్టుల భర్తీ కోసం 2023 సంవత్సరం 10 వ నెల 30వ తేదీన జారీ చేసిన అధ్యాపక నియామక నోటిఫికేషన్లు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు రుసుము తిరిగి పొందేందుకు సంబంధించిన సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ బీఆర్‌ఏయూ.ఈడియూ.ఇన్‌ ను సంప్రందించాలని సూచించారు. కొత్త నోటిఫికేషన్లు, తేదీలు, ఇతర వివరాలు విడిగా ప్రకటించనున్నామని తెలిపారు.

ఎచ్చెర్ల: డాక్డర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెచ్‌బీఎస్‌ అండ్‌ హెచ్‌ఎస్‌ఎస్‌ కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న మజ్జి రామారావు విద్యార్థినితో అసభ్యంగా ఫోన్‌లో మాట్లాడిన అంశంపై విచారణ జరిపా రు. వీసీ కేఆర్‌ రజిని నియమించిన త్రిసభ్య క మిటీ శనివారం వర్సిటీలో విచారణ జరిపారు. కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, విద్యార్థినితో వేర్వేరుగా కమిటీ సభ్యులు విచారణ చేపట్టి వివరణ తీసుకున్నారు. ఈ కమిటీ చైర్మన్‌గా నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత వీసీ వి. బాలహోహాన్‌దాస్‌, సభ్యులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రధానాచార్యులు కె.సీతామాణిక్యం, విశ్రాంత జిల్లా జడ్జి ధర్మారా వు ఉన్నారు. అయితే విద్యార్థిని వేధింపులపై సంబంధిత కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మ జ్జి రామారావును అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా వర్సిటీ అధికారులు నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇచ్ఛాపురం: ప్రతి ఒక్కరూ ఇతర జీవులపై జా లి, దయా గుణం కలిగి ఉన్నప్పుడే అందరూ సంతోషంగా ఉండడం సాధ్యమవుతుందని జైనమత సన్యాసులు శ్వేతాంబర్‌ తెరపంతి ఆచార్య మహాశ్రమ అన్నారు. చైన్నె నుంచి ఒడిశాలోని కటక్‌ వరకు పాదయాత్ర చేపట్టిన జైనమత సన్యానులు, శిష్యులు శనివారం పట్టణం చేరుకున్నారు. వీరికి జ్ఞానభారతి పాఠశాల కార్యదర్శి జోహార్‌ఖాన్‌ స్వాగతం పలికి పాఠశా ల ఆవరణలో విడిది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైనమత సన్యానులు మాట్లాడుతూ జైనమతంలో అత్యంత పవిత్రంగా భావించే చతుర్మాస దీక్షను నాలుగు నెలల కాలం పాటు కఠినంగా పాటించి దీక్షను పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

వజ్రపుకొత్తూరు రూరల్‌: వేసవి సెలవు ల్లో ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెట్టడం సరికాదని ఏపీటీఎఫ్‌ (1938) జిల్లా శాఖ అధ్యక్షుడు మామిడి భుజింగరావు అన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత ప్రణాళికలు అత్యవసరంగా తయారు చేసి సమర్పించాలని జిల్లా విద్యాశా ఖాధికారులు ఆదేశాలు ఇవ్వడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వేసవి సెలవులు అని ఆలోచించకుండా ఒకటి రెండు రోజుల్లో ఆయా ప్రణాళికలు రూపొందించి అందించాల న్న అధికారుల తీరు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేదిగా ఉందన్నారు. స్వల్పకాలంలో ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని, పాఠశాల కమిటీలతో కూలంకషంగా చర్చలు జరిపి ఈ ప్రణాళికలను రూపొందించాల్సి ఉన్నందున వేసవి సెలవులు ముగిసి పాఠశాల లు తెరిచిన తర్వాత ఈ ప్రణాళికలు సమర్పించేలా అధికారులు ఆదేశాలను సవరించాలని ఆయన కోరారు.

హిరమండలం: ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం రూరల్‌ మండలం రాగోలుకు చెందిన గౌతమి, రోజారాణి, హనీష్‌లు హిరమండలంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. తిరిగి వెళుతుండ గా ఎల్‌ఎన్‌పేట మండలం రావిచంద్రి సమీపంలో వెనుక బైక్‌పై వస్తున్న రాఘవ ఢీకొట్టాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని 108లో ఆ మదాలవలస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement