●ముగ్గురు కొడుకుల్ని సైనికులుగా.. | - | Sakshi
Sakshi News home page

●ముగ్గురు కొడుకుల్ని సైనికులుగా..

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

●ముగ్గురు కొడుకుల్ని సైనికులుగా..

ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన ఈమె పేరు మంగి హేమావతి. ఈమెకు ఆనంద్‌, యోగానంద్‌, యోగేశ్వరరావు ముగ్గురు కొడుకులు. చిన్నతనంలో పుట్టిన రోజు చేస్తే తన ముగ్గురు పిల్లలకు మిలట్రీ డ్రస్సులు వేసి ఆనందించేవారు. మీరు పెద్దయితే మీ ముగ్గురూ దేశం కోసం సైనికులుగా మారి భరతమాతకు సేవ చేయాలంటూ ఉన్నత చదువులు చదివించారు. 2002లో పెద్ద కొడుకు ఆనంద్‌ మీరట్‌లో ఆర్మీలో జవాన్‌గా, రెండో కొడుకు యోగానంద్‌ 2003లో పంజాబ్‌లో ఆర్మీ జవాన్‌, మూడో కొడుకు యోగేశ్వరరావు 2004లో జమ్మూలో ఆర్మీ జవాన్‌గా ఎంపికయ్యారు. తన ముగ్గురు కొడుకుల్ని సైనికులుగా మార్చి తన కలలను నిజం చేసింది హేమావతి. దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉంటున్న ముగ్గురు కుమారుల్ని చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని ఆనందభాష్పాలతో చెబుతోంది హేమావతి.

మంగి హేమావతి

Advertisement
 
Advertisement
Advertisement