●ఒక కొడుకును కోల్పోయినా.. | - | Sakshi
Sakshi News home page

●ఒక కొడుకును కోల్పోయినా..

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

●ఒక కొడుకును కోల్పోయినా..

ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామానికి చెందిన ఈమె పేరు లోపింటి మహాలక్ష్మి. ఈమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు కిషోర్‌కుమార్‌ మిలట్రీలో చేరతానంటే, తండ్రి పద్మనాభం వారించినప్పటికీ, తల్లి మహాలక్ష్మీ పెద్ద మనస్సుతో సైన్యంలోకి పంపించింది. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత 2007 డిసెంబర్‌13న చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజూపూర్‌లో నక్సల్స్‌కు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లకు మధ్య జరిగిన కాల్పుల్లో కిశోర్‌కు మార్‌ నేలకొరిగాడు. కుటుంబం అంతా తల్లడిల్లినా ...తల్లి మహాలక్ష్మీ మాత్రం దేశ రక్షణ కోసం తన కొడుకు ఆశువులు బాసాడు అంటూ గొప్పగా చెప్పుకుంది. అధైర్య పడకుండా తన చిన్న కొడుకు అశోక్‌ను సైతం అదే సైన్యంలో చేర్పించింది. ప్రస్తుతం అశోక్‌ రాంచీలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

లోపింటి మహాలక్ష్మీ

Advertisement
 
Advertisement
Advertisement