వ్యక్తి ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

సారవకోట: మండల కేంద్రం సారవకోటకు చెందిన బొల్లు తిరుపతిరావు(56) శనివారం కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపతిరావు బుడితి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సారవకోట పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement