నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన ప్రసాద ట్రస్ట్‌కు నగరానికి చెందిన కింతలి మురళీధర్‌, నిర్మల దంపతులు రూ.లక్ష విరా ళం అందజేశారు. ఈ మేరకు శనివారం ఆలయ ఈవో కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌కు విరాళ నగదు దాతలు అందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నదాన ప్రసాదాన్ని నిత్యం దాతల విరాళాల వడ్డీలతోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. నిత్యం కనీసం వెయ్యి మందికి అన్నప్రసాదం అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

టీచర్లను ఇబ్బందిపెట్టవద్దు

శ్రీకాకుళం: మండు వేసవిలో రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా ఉపాధ్యాయులకు పనులు అప్పగించడం సమంజసం కాదని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు చావలి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు శనివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందినవారని గుర్తు చేశారు. ప్రత్యేక తరగతులు, ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌, క్లస్టర్‌ హేబిటేషన్‌ ప్లాను పేర్లతో రాతపూర్వక ఆదేశాలు లేకుండా మౌఖికంగా, ఆన్‌లైన్‌ సమావేశాలు, వాట్సాప్‌ మెసేజ్‌లతో రకరకాల పనులు అప్పగించడం భావ్యం కాదన్నారు. మానసికంగా వేధింపులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు వ్యక్తిగత పనులకు వెళ్లారని, కొందకరు స్వగ్రామాలకు చేరుకున్నారని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

నరసన్నపేట: గుండవల్లిపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏ.కుమార స్వామి, ఏ.సాంబమూర్తిలు గాయపడ్డారు. వీరు నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద, చిన్న దూగాం గ్రామాలకు చెందిన వీరు శ్రీకాకుళం నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను ఎన్‌హెచ్‌ అంబులెన్స్‌ సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement