ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ

May 10 2026 9:46 AM | Updated on May 10 2026 9:46 AM

పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని శ్రీనివాసనగర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో శుక్రవారం దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంటి తాళాలు పగలుగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎల్‌.హేమశంకర్‌ అనే ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మందసలోని తన స్వగ్రామానికి వెళ్లారు. శనివారం ఉదయం వచ్చి చూసే సరికి ఇంటికి తాళాలు లేవు. లోపలికి వెళ్లి బీరువాను పరిశీలించగా అందులో రెండు తులాల బంగారు నగలు, రూ.70వేలు నగదు, కిలో వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతోకాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నర్సింహమూర్తి సిబ్బంది వచ్చి పరిశీలించారు. దొంగలు ఉపయోగించిన ఇనుపరాడ్లను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement