ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 23 వినతులు

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

మందస: స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో శుక్రవారం గిరిజనుల సమస్యలపై పీజీఆర్‌ఎస్‌ కు 23 వినతులు అందా యి. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఆర్డీఓ ఎర్‌.అప్పలరాజు, తహసీల్దార్‌ మిస్క శ్రీకాంత్‌ పాల్గొన్నారు. కుసుమాల గ్రామంలో తాగునీటి వాటర్‌ ట్యాంకు మంజూరు, రోడ్డు పనులు వేగవంతం చేయాలని కోరారు. నువాగడ గ్రామానికి విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని, పట్టులోగాం గ్రామంలో రోడ్డును మరమ్మతు చేయాలని, సీసీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. కుడుమసాయి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయాలని మరికొందరు కోరారు. సవర మధ్య గ్రామానికి వ్యవసాయ బావులకు త్రీ ఫేస్‌ విద్యుత్‌ను అందించాలని, ఒడిశా అధికారుల నుంచి ఎదురవుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

‘వేధింపులు ఆపండి’

శ్రీకాకుళం అర్బన్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపోలో ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని, ఈ వేధింపులు తక్షణమే ఆపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ శ్రీకాకుళం రెండో డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్‌ బాబు, కె.బాబూరావులు అన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరు తూ శుక్రవారం ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, ఉద్యోగులపై పని భారం పెంచుతోందన్నారు. డబుల్‌ డ్యూటీలు చెయ్యమని ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం రెండవ డిపో ఉద్యోగులు ఆనంద్‌, వై.దుర్గారావు, ఎస్‌.జోగారావు, ఎస్‌ఎస్‌ రావు, బి.సుభద్ర పాల్గొన్నారు.

టెన్త్‌ టాపర్లకు నేడు పురస్కారాల ప్రదానం

శ్రీకాకుళం : వసుదైక కుటుంబం యూనివర్సల్‌ ఫ్యామిలీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్రెడిట్‌ బి సంస్థ సౌజన్యంతో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి పది మంది ప్రభు త్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్నట్లు వి.కె.ఫ్యామిలీ సభ్యులు, జిల్లా సమన్వయకర్త పి.హరిప్రసన్న, లాభాల గుణశేఖర్‌, జి.సాయికుమార్‌, పైల సత్యవతి, రావాడ పాపారావు, పైడి సునీత తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్‌ కాలేజీ రో డ్డులోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సెమినార్‌ హాల్‌లో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు. సీరపు దేవీ ప్రియ –594(జెడ్పీ ఉన్నత పాఠశాల, పైడి భీమవరం), నౌపడ చిద్విలాస్‌–593(మున్సిపల్‌ హైస్కూల్‌, మెట్టక్కివలస), ఎన్‌.రమ్యశ్రీ –593(ఏపీ మోడల్‌ స్కూల్‌, కొండములిగాం), బి.కాత్యాయ వరప్రసన్న–591 (గవర్నమెంట్‌ స్కూల్‌ – కవిటి), కె.దీపిక–591(ఏపీ మోడల్‌ స్కూల్‌, తామాడ), పూజారి కీర్తి పండా –591(జెడ్పీ హైస్కూల్‌, కాశీబుగ్గ), బి.షర్మిల–591(ఎం.జె.పి, పలాస), శివ హరీష్‌ అంజంగి–591(ఎం.జె.పి–సంతబొమ్మాళి), పి.సత్య ఇందు–591(మున్సిపల్‌ హైస్కూల్‌, అరసవల్లి) బగాతి మౌనిక 591(జెడ్పీ హైస్కూల్‌, లింగాలవలస)లకు పురస్కారాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. టాప్‌ 10 విద్యార్థులతో పాటు, స్కూల్‌ హెడ్‌ మాస్టర్స్‌, ప్రిన్సిపాల్స్‌, తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement