● భూమి కోసం రిటైర్డ్ ఉద్యోగి పోరాటం
● దక్కని న్యాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ కార్యాలయంలో పని జరిపించుకోవడం సామాన్యులకు రానురాను అసాధ్యమైపోతోంది. సామాన్యులకే కాదు రిటైర్డ్ గెజిటెడ్ అధికారులకు సైతం ఇక్కడ నిరీక్షణ తప్పడం లేదు. మట్ట మల్లేశ్వరరావు శ్రీకాకుళం నివాసి, రిటైర్డు గెజిటెడ్ అధికారి. ఆయన దివ్యాంగుడు కూడా. ఆయనకు జలుమూరు మండలంలోని జలుమూరులో సర్వే నెంబర్ 87–15 లో 20 సెంట్ల భూమి ఉండేది. కొన్నేళ్ల కిందట ఏడు సెంట్లు భూమిని విక్రయించారు. మిగిలిన భూమిని రికార్డుల్లో సెంటు సెంట్లు తక్కువగా చూపించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్ర యించగా రోడ్డులో కొంత కలిసిందని అధికారులు చెప్పారు. రీ సర్వేలో రెండు సెంట్లు తేడా రావడంతో ఆయన ఫిర్యాదు చేయగా.. రో డ్డులో కలిసిపోయిందని చెప్పారు. ఆధారాలు కావాలని అడిగితే ఎవరూ స్పందించడం లేదు.
దీంతో ఆయన రెండేళ్లుగా ఈ సమస్య పరిష్కరించాలని గ్రీవెన్స్‌సెల్‌కు వెళ్తూనే ఉన్నారు. రెవెన్యూ సదస్సులు, గ్రామ సభల్లోనూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టర్‌ను నేరుగా కలిస్తే.. ఆయన జలుమూరు తహసీల్దార్‌ను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కానీ అవి కూడా బుట్టదాఖలయ్యాయి. ఇక్కడ ఫిర్యాదు దారు ఒకప్పు డు గెజిటెడ్ ఆఫీసర్. అందులోనూ దివ్యాంగుడు. ఆయన సమస్య పరిష్కారం కావడానికే ఇన్నేళ్లు పడితే ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కర్లేదు. దీనిపై మల్లేశ్వరరావు మాట్లాడుతూ తన భూమిని తన పేరిట ఇవ్వడానికి ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
పలు దుకాణాల్లో చోరీ
టెక్కలి రూరల్: స్థానిక అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఉన్న పలు దుకాణాల్లో చోరీ జరిగినట్లు షాపు యజమానులు శుక్రవారం గుర్తించారు. అరటిగెలల షాపు, కూరగాయల షాపు, గుడ్లు షాపులతో పాటు పూజ సామగ్రి షాపుల్లో చోరీలు జరిగినట్లు గుర్తించారు. మొత్తం నాలుగు షాపులకు సంబంధించి సుమారు రూ.40వేలు వరకు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.


