విపత్తుల నిర్వహణపై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

విపత్తుల నిర్వహణపై శిక్షణ

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

శ్రీకాకుళం కల్చరల్‌: ప్రపంచ రెడ్‌క్రాస్‌, తలసేమియా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని శాంతా కల్యాణ అనురాగం నిలయంలో శుక్రవారం వలంటీర్లకు, విద్యార్థులకు విపత్తుల నిర్వహణ, సామర్థ్యం పెంపుపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విపత్తుల నుంచి నష్టాన్ని తగ్గించుకోవటానికి శిక్షణ కార్యక్రమాలు ఎంత దోహదపడతాయన్నారు. జిల్లా రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహన రావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వలంటీర్లకు నైపుణ్యాలు కలిగించడం ద్వారా తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు అన్నారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్‌, పి.శ్రీకాంత్‌, ఎం.కళ్యాణ్‌ చక్రవర్తి, బి. చిన్మయి రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement