11న జిల్లాస్థాయి స్విమ్మింగ్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

11న జిల్లాస్థాయి స్విమ్మింగ్‌ ఎంపికలు

May 8 2026 1:13 PM | Updated on May 8 2026 1:13 PM

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్విమ్మింగ్‌ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవ అద్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎన్‌ఎస్‌వీ ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, ఉపాధ్యక్షుడు వై.సూర్యారావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.కాంతారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీలో ఉన్న డీఎస్‌ఏ స్విమ్మింగ్‌ పూల్‌ వేదికగా ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఎంపికల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇక్కడ రాణించి ఎంపికైన క్రీడాకారులను ఈనెల 24వ తేదీన కర్నూలులో జరిగే ఏపీ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన స్విమ్మింగ్‌ క్రీడాకారులు తమ పేర్లను ఈనెల 9వ తేదీలోగా డీఎస్‌ఏ కోచ్‌ మురళీ (సెల్‌: 9908831849)ని సంప్రదించాలని వారు కోరారు.

‘ఒడిశా అధికారుల నుంచి రక్షించండి’

మందస: మాణిక్యపట్నం గిరిజనులపై ఒడిశా అధికారులు, పోలీసుల దౌర్జన్యాలు ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు విన్నవించారు. జనగణనలో భాగంగా సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామంలో ఉంటున్న గిరిజనులపై ఒడిశా అధికారులు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. రక్షించాలని తహసీల్దార్‌ మిస్క శ్రీకాంత్‌, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌, ఎంపీడీఓ వై.వెంకటరమణలకు వినతి పత్రం అందజేశారు. సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామంలో సుమారు 30 గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ సచివాలయం సిబ్బంది జనగణన చేసి ఇంటి గోడలపై నంబర్లు వేశారు. అనంతరం ఒడిశా అధికారులు, పోలీసులు వచ్చి ఆ నంబర్లను చెరిపివేశారు. ఇళ్లలో ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. తాము చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నామని గిరిజనులు ఆవేద న వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి సవర గురునాథ్‌, రైతుల సంఘం కార్యదర్శి పి.దేవేంద్ర, మట్ట ధర్మారావు, ఎన్‌.భాస్కరరావు, ఎస్‌.విప్రో, ఎస్‌.మధుసూదన్‌, ఎస్‌.సుదన్‌ తదితరులు పాల్గొన్నారు.

సచివాలయ కిటికీ అద్దాలు ధ్వంసం

సారవకోట: మండలంలోని కిడిమి సచివాలయ కిటికీ అద్దాలను నాలుగు రోజుల కిందట ఆకతాయిలు పగలగొట్టారు. సచివాలయ సిబ్బంది తమ విధులు ముగించుకుని ఇంటికెళ్లిన తర్వాత రాళ్లతో కొట్టడంతో అద్దాలు పగిలి పోయాయని వీఆర్వో రాము తెలిపారు. అయితే దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.

వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లమో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

ఆమదాలవలస: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రి న్సిపల్‌ సీపాన నీలవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని వివరించారు. దరఖాస్తులు ఆచార్య ఎనన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌ www.angrau.ac.i n ద్వారా సమర్పించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7702394824 నంబర్‌ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement