2015లో కూడా గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ యూనిట్‌గా 100 మంది విద్యార్థులు గల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు సమీపంలోని 2 నుంచి 3 పాఠశాలలను విలీనం చేస్తూ నాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా పాఠశాలకు ప్రత్యేక పద్దుల్లో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ తరగతికో ఉపాధ్యాయుడిని, ప్రత్యేక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టును, గ్రంథాలయం, భాషా ప్రయోగశాల ఏర్పాటు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అవేవీ కార్యరూపం దాల్చకపోగా పాఠశాలలు మూతపడటం మాత్రమే మిగిలింది. – దుప్పల శివరాంప్రసాద్, ఆపస్, జిల్లా అధ్యక్షుడు


