మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

హిరమండలం: కూటమి ప్రభుత్వానికి మొక్కజొన్న రైతుల ఉసురు తగులుతుందని వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. గురువారం అక్కరాపల్లిలో అకాల వర్షాలకు పాడైన పంటలను, మొలకలు వచ్చిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులు ఈ సందర్భంగా కన్నీరుమున్నీరయ్యారు. వరి తరువాత ఎక్కువగా మొక్కజొన్న వేసుకున్నామని.. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటుచేయలేదన్నారు. అందుకే కల్లాల్లో ఉన్న మొక్కజొన్న అకాల వర్షాలకు తడిసిపోయిన విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ అన్నదాతను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.

లేకుంటే వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. ఆమెతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వెంకట రామకృష్ణ, నాయకులు చింతాడ సూర్యనారాయణ, లుకలాపు ప్రసాద్‌, ఎం.శంకరరావు, జి.సుధీర్‌, ఎల్‌.శ్రీనివాసరావు, సింహాచలం, జనార్దనరావు, శిమ్మ పాపయ్య, వంజరాపు చిరంజీవి, జ్యోతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement