రెమిడియల్‌ క్లాసులపై ఉత్తర్వులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రెమిడియల్‌ క్లాసులపై ఉత్తర్వులు ఇవ్వాలి

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

శ్రీకాకుళం : టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం ఉపాధ్యాయులు ప్రతిరోజూ రెమిడియల్‌ క్లాసులకు రావాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం సరికాదని, తక్షణం రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆన్‌లైన్‌ సమావేశాల ద్వారా, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా, ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులను క్లాసులు రావాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. రెమిడీయల్‌ క్లాసులకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా కల్పించకపోవడాన్ని వారు తప్పుపట్టారు. డీఈఓను కలిసిన వారిలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు బమ్మిడి శ్రీరామ్మూర్తి, కార్యదర్శి పి.ప్రతాప్‌కుమార్‌, ఎస్‌.కిషోర్‌కుమార్‌, చావలి శ్రీనివాస్‌, పప్పల తిరుమలరావు, పి.ఆనందరావు, పి.సూర్యప్రకాశరావు, వై.ఉమాశంకర్‌, జి.సురేష్‌,హెచ్‌ అన్నాజీరావు, బి.రవికుమార్‌, జి.శ్రీరామచంద్రమూర్తి, టి.ఉమాభాస్కర్‌, వి.శ్యామ్‌కుమార్‌, పి.అప్పారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement