బంక్‌లు వినియోగం వినియోగం
● మనకంటే ఒడిశాలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్
● అక్కడికే వెళ్తున్న సరిహద్దు గ్రామాల ప్రజలు
● వెలవెలబోతున్న స్థానిక బంకులు
ధర తక్కువే..
ఆంధ్రాలో కంటే ఒడిశాలోని పర్లాకిమిడిలో పెట్రోల్ ధర తక్కువ. లీటర్ పెట్రోల్‌కు రూ.7లు తక్కువగా ఉంటుంది. అందుకే పర్లాకిమిడి వెళ్లినప్పుడు పెట్రోల్ వేయిస్తాను. ఇక్కడి ధర, నాణ్యతతో పోల్చితే ఆర్థికంగా మిగిలే ఉంటుంది.
– బొంగు శ్రీరాములు, ఆర్.ఎల్.పురం, పాతపట్నం
నాణ్యత బాగుంటుంది
ఒడిశాలో పెట్రోల్ బంక్‌లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. కల్తీ లేని పెట్రోల్ విక్రయిస్తారని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. ఆంధ్రా కంటే ఒడిశాలో తీసుకున్న పెట్రోల్ నాణ్యత బాగుంటుంది. వాహనాలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని మోకానిక్‌లు చెబుతున్నారు. అందుకే ఒడిశా వెళ్లి పెట్రోల్ వేయించుకుంటాం. ఎన్ని లీటర్ల పెట్రోల్ పోయిమన్నా పోస్తున్నారు.
– గణపతి మధుబాబు, కాగువాడ, పాతపట్నం
సమాధానం చెప్పాలి
ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరలపై చంద్రబాబు, లోకేష్‌లు హడావుడి చేశారు. ఇప్పుడు పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయో సమాధానం చెప్పాలి. అలాగే రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మన రాష్ట్రంలో కొరత లేకుండా చూడడంతో పాటు ధరల తగ్గించాలి.
– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం
పాతపట్నం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ మాటనే మరిచారు. యువగళం పాదయాత్ర సమయంలో పక్క రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని, కేవలం మన రాష్ట్రంలోనే ఎక్కువని విమర్శించిన మంత్రి లోకేష్.. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ధరలపై కనీసం నోరు మెదపడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నం ఒడిశా రాష్ట్రానికి పక్కనే ఉంది. కొత్తూరు, మెళియాపుట్టి మండలాలు సైతం సరిహద్దులో ఉన్నాయి. అలాగే పది, పదిహేను కిలోమీటర్ల దూరంలోనే హిరమండలం ఉంది. అయితే ఒడిశా రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ధరలు లభిస్తుండడంతో ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు అక్కడికే వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. పెట్రోల్‌లో లీటర్‌కు రూ.7లు, డీజిల్‌లో లీటర్‌కు రూ.3లు ఆ రాష్ట్రానికి మనకు తేడా ఉండడం గమనార్హం. దీంతో ఇక్కడి వాహనదారులు నిత్యం పర్లాకిమిడి పట్టణంలోని పెట్రోల్ బంక్‌లను ఆశ్రయించి, వాహనంలోకి పెట్రోల్ నింపుకుంటున్నారు. ఒడిశా సరిహద్దులో ఉన్న పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు చెందిన వేలాది మంది వినియోగదారులు అనేక రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు నిత్యం ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి పట్టణానికి వెళ్తుంటారు. దీంతో ఒడిశాలో తక్కువ ధరకు దొరుకుతున్న డీజిల్, పెట్రోల్‌కు గిరాకీ ఏర్పడుతోంది. తరచూ ఒడిశాకి వెళ్లలేని కొందరు వాహనదారులు పది లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకుని వచ్చి ఇంటి వద్ద నిల్వ ఉంచుకుంటారు. డీజిల్ కంటే పెట్రోల్ కోసం వెళ్లే వాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. అయితే పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడా
ఇంధనం ఆంధ్రాలో ఒడిశాలో తేడా
పెట్రోల్ రూ.109.96లు రూ.102.62లు రూ.7.34లు
డీజిల్ రూ.97.73లు రూ.94.19లు రూ.3.54లు
రోజుకు వినియోగం(లీటర్లులో..)
మండలం పెట్రోల్ పెట్రోల్ డిజిల్
పాతపట్నం 2 3,000 3,800
మెళియాపుట్టి 2 2,500 1,800
కొత్తూరు 4 3,100 3,900
హిరమండలం 3 2,500 2,900
ఎల్.ఎన్.పేట 2 1,400 1,900


