ఎచ్చెర్ల: ఈ విద్యా సంవత్సరంలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 6, 7, 8 వ తేదీల్లో జిల్లాలోని ఏడు ఐటీఐ కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎచ్చెర్ల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.సుధాకర్ తెలిపారు. ఈ నెల 6 వ తేదీన ఎచ్చెర్ల ప్రభుత్వ పాఠశాలలో డ్రైవ్ జరుగుతుందన్నారు. దీనికి శ్రీరామ, గణేష్ ఐటీఐ విద్యార్థులు హాజరుకావాలన్నారు. ఈ నెల 7 వ తేదీ న డాక్టర్ వి.కణితీస్, సాయి తిరుమల, సర్వ మంగళ ఐటీఐ కళాశాలల్లో జరుగుతుందన్నా రు. ఈ నెల 8 వ తేదీన శ్రీవెంకటేశ్వర, భారతి ఐటీఐ కళాశాలల్లో డ్రైవర్ జరుగుతుందని తెలిపారు. ఐటీఐ కళాశాలల్లో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పన లక్ష్యంతో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాధాన్ సమరోహ్–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా మంగళవారం తెలిపారు. ఈ లోక్ అదాలత్ ఆగస్టు 21, 22, 23 తేదీల్లో సుప్రీంకోర్టులోనే నిర్వహి స్తారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెండింగ్‌లో ఉన్న కేసుల ప్రమాదాలకు సంబంధించి క్లెయి మ్‌లు, చెక్‌బౌన్స్ కేసులు, భూ సేకరణ సమస్యలు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కార్మికులకు సంబంధించిన సమస్యలు, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు సుప్రీంకోర్టు లోక్ అదాలత్ కు సంబంధించి గూగుల్ ఫార్మ్ (www.sci.gov.in), జిల్లా కోర్టు వెబ్ సైట్‌లో లోక్ అదాలత్ ఫార్మ్ ఉంచినట్లు చెప్పారు. పార్టీలు తమ అంగీకారంను తెలియజేయాల్సి ఉందన్నారు. పార్టీలు వారి అడ్వకేట్లతో జిల్లాలో మాత్రమే హాజరు కావచ్చన్నారు. పార్టీలు వారి సంబంధిత అడ్వకేట్లతో డీఎల్‌ఎస్‌ఏ నిర్వహించే సెటిల్ మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా హాజరు కావచ్చన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 08942–224675, 9440901060 సంప్రదించాలన్నారు.
కలెక్టర్, ఎస్పీ సుడిగాలి పర్యటన
నరసన్నపేట: నరసన్నపేటలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లు మంగవారం నరసన్నపేటలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన వీరు అనంతరం ఇందిరానగర్, డంపింగ్ యార్డుకు వెళ్లి చెత్త సేకరణ పద్ధతులు పరిశీలించారు. డంపింగ్ యార్డు వృథాగా పడి ఉండడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇంత విశాలమైన యార్డు ఉన్నప్పటికీ దీన్ని వినియోగించడంలో ఎందు కు శ్రద్ధ చూపలేదని అధికారులను ప్రశ్నించా రు. అనంతరం కంబకాయ రోడ్డులో ఉన్న పాత ఇనుము దుకాణానికి వెళ్లి అక్కడ పాత వస్తువులను ఎలా గ్రేడింగ్ చేస్తున్నారు.. ఏయే వస్తువులు ఎక్కడెక్కడ విక్రయాలు చేస్తున్నారు అనేది అక్కడి కార్మికుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో 13 మండలాల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. హెలీప్యాడ్‌ను, మీటింగ్ ప్రదేశాలకు అనువైన స్థలాలను పరిశీలించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి వస్తున్నందున అధికార యంత్రాంగం అంతా సన్నద్ధం కావా లన్నారు. నరసన్నపేటలోని 20 వార్డులను పరిశీలించి చెత్త సేకరణపై పూర్తిగా అవగాహన కలిగించాలని, ఈ వారం రోజులూ చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న మండల స్థాయి అధికారులు సరైన సమాచారంతో సిద్ధంగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో పాటు, ట్రైనీ కలెక్టర్ హరిహోం పాండియా, జెడ్పీ సీఈఓ వెంకటరామన్, డీపీఓ మధుబాలతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


