గ్యాస్‌ కనెక్షనా.. ఇప్పట్లో ఇవ్వలేం! | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కనెక్షనా.. ఇప్పట్లో ఇవ్వలేం!

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : జిల్లాలో ఎల్‌పీ గ్యాస్‌ కనెక్షన్ల జారీ ఆగిపోయింది. ప్రస్తుతం సింగిల్‌ సిలిండర్‌తో పాటు రెండోది కావాలన్నా ఇవ్వడం లేదు. కొత్త కనెక్షన్లకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ, డబుల్‌ సిలిండర్ల మంజూరును తాత్కాలికంగా నిలిపేశారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు చెందిన గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా జిల్లాలో గృహ, వాణిజ్య అవసరాలకు సిలిండర్ల సరఫరా జరుగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో కొత్త కనెక్షన్ల మంజూరు విషయంలో ఆయిల్‌ కంపెనీలు ఆంక్షలు విధించాయి.

బుకింగ్‌ విధానాల్లో మార్పు

ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో డబుల్‌ సిలిండర్‌ ఉంటే 30 రోజులు, సింగిల్‌ సిలిండర్‌ ఉంటే 25 రోజులకు బుక్‌ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా డబుల్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునేందుకు 35 రోజులకు పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్‌ సిలిండర్‌ ఉన్నవారికి గ్యాస్‌ బుకింగ్‌కు 25 రోజుల గడువు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల వారీగా 40 రోజులకు ఓసారి మాత్రమే బుక్‌ చేసుకోవాలి. గ్యాస్‌ సమస్య తలెత్తడంతో రోజూ పెద్ద సంఖ్యలో వినియోగదారు లు కొత్త కనెక్షన్ల కోసం కార్యాలయాలకు వస్తున్నా రని గ్యాస్‌ సరఫరా ఏజెన్సీల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement