● సర్పాల సయ్యాట | - | Sakshi
Sakshi News home page

● సర్పాల సయ్యాట

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

344 మందికి ఆరు రోజుల

వేతనాలు కట్‌

రణస్థలం: లావేరు మండలంలోని బుడతవలస ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కెల్ల జగదీష్‌ కుమార్‌ చేసిన నిర్వా కం వల్ల 344 మంది వేతనదారులకు 6 రోజుల వేతనాలు రాలేదు. దీంతో సుమారు 50మంది వేతనదారులు మండల పరిషత్‌ కార్యాలయానికి వచ్చి ఎంపీడీఓ పి.వెంకటరాజు, ఉపాధి హామీ ఏపీఓ ఆర్‌.సత్యవతి ఎదుట వాపోయారు. బుడతవలస గ్రామంలోని వేతనదారులు గత వారం రోజులుగా చెరువు పని చేశారు. అయితే దీనిపై మస్టర్‌ షీట్‌పై సంతకాలు తీసుకుని ఉపాధి హామీ కార్యాలయానికి అందజేయడం లేదు. వారం పాటు ఇలా చేయడంతో వేతనదారుల హాజరు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌ లైన్‌లో నమోదు కాలేదు. దీంతో ఆ మేరకు వేతనాలు పొందలేకపోయారు. దీనిపై ఎంపీడీఓ పి.వెంకటరాజు, ఏపీఓ ఆర్‌ సత్యవతి మాట్లాడుతూ 344మంది వేతనాలు అందేలా చర్యలు చేపడతామని, సంబంధిత ఫీల్డ్‌ అసిస్టెంట్‌ జగదీష్‌పై పీడీ కార్యాలయానికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పిస్తామని చెప్పారు.

టెక్కలి వంశధార కాలనీలో సోమవారం సర్పాల సయ్యాట కనిపించింది. స్థానికులు ఆ దృశ్యాలను ఆసక్తిగా గమనించారు. – టెక్కలి

Advertisement
 
Advertisement
Advertisement