శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పాఠశాల విద్యార్థులు, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏటా నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు) మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియ వేదికగా ఇన్‌చార్జి డీఎస్‌డీఓ ఎం.మాధురీలత సోమవారం సాయంత్రం ఈ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పా రు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన 8 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు ఈ శిక్షణలో పాల్గొనవచ్చన్నారు. అనంతరం ఎంపిక చేసిన శిక్షణ శిబిరాల కోచ్‌లకు క్రీడాపరికరాలను పంపిణీ చేశారు.


