1104 యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శిగా లోకేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

1104 యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శిగా లోకేశ్వరరావు

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

1104 యూనియన్‌ రీజనల్‌ కార్యదర్శిగా లోకేశ్వరరావు హక్కుల కోసం అలుపెరుగని పోరాటం

అరసవల్లి: ఏపీ ఎలక్ట్రికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (1104) రీజనల్‌ కార్యదర్శిగా నక్క లోకేశ్వరరావు, అధ్యక్షునిగా టీవీ సుబ్రహ్మణ్యం (సుబ్బు) ను ఎన్నుకున్నారు. ఈమేరకు డిస్కం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహంతి ప్రభాకరరావు, ఏవీ రాంప్రసాద్‌ సంయుక్త అధ్యక్షతన ఆదివా రం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల ఎమర్జెన్సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీర్మానించారు. తదుపరి ఎన్నికల వరకు వీరిని తాత్కాలిక ప్రతినిధులుగా ఎన్నుకున్నట్లుగా ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఇటీవల 1104 సంఘ రీజనల్‌ కార్యదర్శిగా ఉన్న ఎంవీ గోపాలరావును ప్రాఽథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రాప్తికి ఇప్పటివరకు శ్రీకాకుళం రీజనల్‌ అధ్యక్షునిగా ఉన్న లోకేశ్వరరావును రీజన ల్‌ కార్యదర్శిగానూ, టీవీ సుబ్రహ్మణ్యాన్ని రీజనల్‌ అధ్యక్షునిగా తాత్కాలికంగా ఎంపిక చేశారు. ఈ సమావేశంలో డిస్కం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహంతి ప్రభాకరరావు, రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్‌ను చండ్ర రాజే శ్వరరావు 1959 మే 3న ఢిల్లీలో స్థాపించారని ఏఐవైఎఫ్‌ జిల్లా నాయకులు వై.వేణు, ఎస్‌.అన్నాజీలు అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్‌) 67 వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం వారు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని యువత, నిరుద్యోగుల పక్షాన నిలబడి మాట్లాడే ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ యువజన సమాఖ్యను స్థాపించినట్లు తెలిపా రు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం నిర్విరామ ఉద్యమంలో సమాఖ్య భాగస్వామ్యమైందన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అభ్యర్థులకు వయో పరిమితిని పెంచాలని, వలంటీర్లును యథాతథంగా కొనసాగిస్తూ నెలకు రూ 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, నిరుద్యోగులకు రూ 3 వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని, కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

గార: శ్రీకూర్మం కూర్మనాథుడిని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్‌ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి అధికారులు, అర్చకులు ఎదురేగి స్వాగతం పలికారు. మూలవిరాట్‌ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్ర మహత్యాన్ని అర్చకులు కిశోర్‌బాబు, శ్రీనివాసాచార్యులు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ టి. వాసుదేవరావు, బోర సింహాచలం మాస్టారు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్యవతి

శ్రీకాకుళం అర్బన్‌: రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ.సత్యవతి నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆదివారం బీసీ ఉద్యోగుల సంఘ సమావేశంలో సత్యవతికి సంఘ అధ్యక్షుడు ఆవుల నరసింహారావు సమక్షంలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అందజేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తానన్నారు. సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు చౌదరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయిరాం, ఆర్‌.వేణుగోపాల్‌, కిల్లాన శ్రీనివాస్‌, గద్దెబోయిన కృష్ణ, ఇతర ప్రతినిధులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement