బావిలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

బావిలో పడి వ్యక్తి మృతి

May 4 2026 10:37 AM | Updated on May 4 2026 10:37 AM

బావిలో పడి వ్యక్తి మృతి ‘బీసీ ఉద్యోగులకు అన్యాయం చేస్తే పోరాటం’

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని గూనపాలెంలో నివసిస్తున్న యండమూరి భాస్కరరావు (54) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందా రని ఒకటో పట్టణ ఎస్‌ఐ ఎం.హరికృష్ణ ఆదివారం వెల్లడించారు. గ్యాస్‌ స్టవ్‌లు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తున్న భాస్కరరావు ఈనెల 1 ఉద యం బయటకు వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చారు. కుమారుడు మణిబాబు తండ్రిని స్నానం చేసి లోపలికి రమ్మని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఎంత సేపటికీ రాకపోవడంతో బయటకు వెళ్లారులే అనుకుని రాత్రి 10 గంటల వరకు వేచి చూసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయమైనా తండ్రి రాకపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెతకసాగాడు. ఆచూకీ లభించకపోవడంతో అర్ధరాత్రి బావిలోకి మొబైల్‌ టా ర్చి లైటు వేసి చూడగా రెండు కాళ్లు తేలియాడటం చూసి నిశ్చేష్టుడయ్యాడు. కేకలు వేయగా చుట్టుపక్కల వారొచ్చి భాస్కరరావును పైకి తీశారు. తన తండ్రి మేడపై నుంచి మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి ఉంటాడని మణిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం.హరికృష్ణ తెలిపారు.

శ్రీకాకుళం అర్బన్‌: రాష్ట్రంలో బీసీ ఉద్యోగులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున పోరాడతామని రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆవుల నరసింహారావు అన్నారు. శ్రీకాకుళంలోని ఎన్‌జీఓ కార్యాలయంలో ఆదివారం ఏపీ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. బీ సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీసీలకు అధికారం ఉంటేనే రిజర్వేషన్‌లు, పదోన్నతులు లభిస్తాయన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, ఏపీ ఎన్‌జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement