కటకటాల వెనక్కి హంతకుడు | - | Sakshi
Sakshi News home page

కటకటాల వెనక్కి హంతకుడు

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

శ్రీకాకుళం క్రైమ్‌, కొత్తూరు : కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ గిరిజన తండా గ్రామమైన చినరాజపురంలో గిరిజన దంపతులను హత్య చేసిన సవర తోటయ్యను కొత్తూరు సీఐ చింతాడ ప్రసాద్‌, ఎస్‌ఐ కె.వెంకటేష్‌లు అరెస్టు చేశారు. వివరాలను సీఐ ప్రసాద్‌ ఆదివారం వెల్లడించారు.

కుమార్తె అనారోగ్యమే కారణం..

సవర తోటయ్యకు భార్య, రెండేళ్ల కుమార్తె, ఏడాది బాబు ఉన్నారు. కుమార్తె గత కొంతకాలంగా అనా రోగ్యంగా ఉండటంతో ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం కనబడలేదు. దీంతో సవర ఎల్లంగి, అతని భార్య గయానీ (జ్యోతి)లు చిల్లంగి పెట్టి ఉంటారనే అపోహతో ఉండేవాడు. పదిరోజుల కిందట ఇదే విషయమై ఎల్లంగితో గొడవ పడ్డాడు. ఈ పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది కూడా. వారు మందలించడంతో మనసులో పెట్టుకున్న తోటయ్య ఎల్లంగిని చంపేస్తేనే తన కుమార్తె ఆరోగ్యంగా ఉంటుందని బలంగా నిశ్చయించుకున్నాడు.

ఇలా చంపాడు..

గత నెల 28 వేకువజామున 3 గంటలకు లేచిన తోటయ్య గొడ్డలి పట్టుకుని ఎల్లంగి ఇంటికి 4 గంటలకు వెళ్లాడు. ఇంటిలో లేకపోవడంతో బయట సిమెంటు రోడ్డుపై నిద్రిస్తున్న ఎల్లంగి, గయానీ దంపతులను చూశాడు. అంతే గొడ్డలితో వరుస వేటు లతో ఎల్లంగిపై విరుచుకుపడ్డాడు. పక్కనే పడుకున్న గయానీ సైతం లేవడంతో ఆమైపెన గొడ్డలి వేటు వేశాడు. ఆమె కేకలు గట్టిగా వేయడంతో పక్క నే ఉన్న సిమెంటు రాయితో దాడి చేసి చంపేశాడు.

కుమారుడు భయపడి..

ఎల్లంగి ఎదురుగా కొత్త ఇల్లు నిర్మిస్తున్న సవర సన్యాసి మేడ మీద ఎల్లంగి కుమారుడు పడుకు న్నాడు. తల్లిదండ్రుల కేకలు విని లేచి చూసేసరికి తోటయ్య ఇద్దరినీ హత్య చేస్తుండటం గమనించి వెళ్తే తనని కూడా చంపేస్తాడేమోనన్న భయంతో రేగులపాడులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిపో యాడు. హత్యలు చేసిన తోటయ్య పారిపోయాడని, ఎల్లంగి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, దానిలో భాగంగా ఆదివారం అరెస్టు చేశామని, సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement