● జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్‌లో రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఇబ్బందులు మొదలవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కు సెల్‌ఫోన్‌తప్పనిసరి చేయడంతో గ్రా మీణ ప్రాంత రోగులు ఇబ్బంది పడుతున్నారు.
● వైఎస్ జగన్ హయాంలో ఇక్కడ ఐదు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ప్రారంభించారు. ఆయా విభాగాల్లో నాడే వైద్యులను నియమించారు. ఇప్పుడు సదుపాయాలు కల్పించకపోవడంతో వారానికి రెండుసార్లే ఓపీ నిర్వహిస్తున్నారు.
● వైద్యులు రాసిన విధంగా రోగులకు సరిపడా మందులు ఇవ్వడం లేదు. 50 మందులు రాస్తే 20 మందులు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి మిగతా మందుల కోసం మరోసారి వచ్చాక మళ్లీ ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకుని, వైద్యులతో చీటీ రాయించుకోవాలని పేచీ పెడుతున్నారు.
● మార్చురీ వద్ద అత్యంత దయనీయ పరిస్థితి ఉంది. పోస్టుమార్టం చేసే ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇటీవల తొలగించడంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇలా వచ్చిన ప్రైవేటు వ్యక్తులు మృతుని బంధువుల నుంచి రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు చేస్తున్నా రు. డబ్బులు ఇవ్వకపోతే పోస్టుమార్టం జాప్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం చేసేందుకు 24గంటలకు పైనే సమయం పడు తుంది. వార్డుల్లో కూడా రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
● 950 పడకల ఆస్పత్రికి రెండే అంబులెన్స్‌లు ఉన్నాయి. అవి సరిపోవడం లేదు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో అష్టకష్టాలు
జిల్లాలో దయనీయ పరిస్థితులు
రోగుల ఘోష వినని చంద్రబాబు ప్రభుత్వం
మూలకు చేరిన ఆర్‌ఓ ప్లాంట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు
తాగునీటికి, నిలువ నీడకు అవస్థలే


