కొబ్బరి ఈనెల వ్యాపారానికి గడ్డు పరిస్థితి
ఈనెల విక్రయాల్లో తగ్గుదలతో
ఆందోళన
కంచిలిలో మూతబడుతున్న
కొబ్బరి ఈనెల దుకాణాలు
ఇండోనేషియా ఈనెల రంగ ప్రవేశంతో ఇక్కడి సరుకుకు తగ్గిన డిమాండ్
కంచిలి:
ఉత్తరాంధ్రలోనే పేరొందిన కంచిలి కొబ్బరి మార్కెట్ అన్ని విధాలుగా కళావిహీనమవుతోంది. ఇక్కడి వ్యాపార సంస్థలు రోజురోజుకూ తగ్గుతున్నా యి. ఫలితంగా మార్కెట్ లావాదేవీలపై ఆధారపడిన వ్యాపారులు, కార్మికులు, రైతులు అంతా నష్టపోతున్నారు. జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి కాయలతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా విలసిల్లేవి. కొబ్బరి కాయలతోపాటు కాయ ల నుంచి తొలగించే తొక్కతో పీచు పరిశ్రమలు, చెట్టు నుంచి రాలిపోయే కొమ్మల నుంచి ఆకుల మధ్యలో ఉండే ఈనెలు వేరు చేసి లాభాలు ఆర్జించే వారు. ప్రస్తుతం కొబ్బరికి ప్రకృతి విపత్తులు, చీడపీడల వ్యాపించడంతో ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో నాణ్యత లోపించిన ఉత్పత్తులతో రైతులు తల్లడిల్లుతున్నారు. తాజాగా కొబ్బరితోపాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని పరిశ్ర మలు ఈ ప్రాంతంలో ఒక్కొక్కటిగా మూతబడుతు న్నాయి. కొబ్బరి ఈనెల వ్యాపారం కూడా మూతబడుతున్న జాబితాలో చేరింది. ఉద్దానంతోపాటు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఈనెలను కంచిలి మార్కెట్‌కు తరలించేవారు. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలతోపాటు పాకిస్థాన్‌కు సైతం ఇక్క డ కొబ్బరి ఈనెల చీపుళ్లను ఎగుమతి చేసేవారు.
ఇక్కడ రైతుల నుంచి కొబ్బరి ఈనెలను కొనుగో లు చేసి, వాటిని మళ్లీ ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం సరిచేసి, ప్యాకింగ్ చేసి ఎగుమతులు చేస్తుంటారు. ప్రస్తుతం రైతుల నుంచి కొబ్బరి ఈనెలను రూ.52 నుంచి రూ.55 వరకు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ కంచిలి మార్కెట్‌లో గల 15 వ్యాపార సంస్థల నుంచి ప్రతి నెలకు 25 వరకు లారీల లోడ్లు ఎగుమతులు అయ్యేవి.
కొన్నేళ్లుగా మన దేశానికి ఇండోనేషియా దేశం నుంచి పెద్ద ఎత్తున కొబ్బరి ఈనెలు దిగుమతి అవుతున్నాయి. ఇవి చూసేందుకు ఇంపుగా ఉండడంతో పాటు తక్కువ ధరకు లభ్యం కావడంతో మార్కెట్ అంతా అటువైపు మళ్లింది. ఇండియాతోపాటు పాకిస్తాన్ తదితర దేశాలకు కూడా ఇండోనేషియా మార్కెట్ నుంచే సరుకు రవాణా అవుతోంది. దీంతో ఇండియన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో గల కొబ్బరి ఈనెల పరిశ్రమకు గట్టి దెబ్బ తగిలింది. కేవలం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో సరకు రవాణా చేసే కంచిలి మార్కెట్ నుంచి ప్రస్తుతం నెలకు 5 నుంచి 6 లోడ్లు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఇలా ఎగుమతులు దిగజారిపోవడంతో ఈ వ్యాపా రంపై ఆధార పడిన వారంతా నష్టపోతున్నారు. సరుకు ఉత్పత్తి చేసిన రైతుల వద్ద నుంచి తోటల్లో ఆకుల నుంచి ఈనెల్ని వేరు చేసే కూలీలు, వ్యాపారులు, వ్యాపార సంస్థలో వాటిని సరిచేసి, ప్యాకింగ్ చేసే కూలీలు, వాటి ప్యాకింగ్‌కు ఉపయోగించే గోనెల వ్యాపారులు, ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులు, వాటి కూలీలు ఇలా అంతా పనుల్లేక రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
కొబ్బరి ఈనెలను ప్రాసెస్ చేస్తున్న మహిళా కూలీలు


