రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం సైనికుల కుటుంబాలకు ‘వీర్‌ పరివార్‌’ అండ

రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస గ్రామంలో జాతీ య రహదారిపై రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఐసర్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధు డు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తాళ్లవలస గ్రామానికి చెందిన మీసాల రామ్మూర్తి (91) తన పొలంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే గుర్తు తెలియని వాహ నం శనివారం మధ్యాహ్నం 1.30 సమయంలో ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. సంఘటనా స్థలానికి లావేరు ఎస్‌ఐ వెళ్లి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అనంతరం హైవేపై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి ఐసర్‌ వ్యాన్‌గా గుర్తించారు. నరసన్నపేట సమీపంలో టోల్‌ప్లాజా వద్ద పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఐసర్‌ వ్యానుగా గుర్తించి పట్టుకున్నారు. మృతుడికి భార్య నారాయణమ్మ, కుమార్తె ఈశ్వర మ్మ ఉన్నారు. ఈ ప్రమాదంపై లావేరు ఎస్‌ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వీర్‌ పరివార్‌ సహాయత యోజన–2025’ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.హరిబాబు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని లీగల్‌ సర్వీస్‌ అథారిటీ చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సైనిక కుటుంబాలకు ఎదురయ్యే ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, ఇతర న్యాయపరమైన చిక్కులను ఈ పథకం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. జిల్లా, రాష్ట్ర జాతీయ సైనిక సంక్షేమ బోర్డుల సమన్వయంతో ఈ పథకం పనిచేస్తుందని, ఇందులో అనుభవజ్ఞులైన సీనియర్‌ న్యాయవాదులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండి తగిన న్యాయ సలహాలు అందిస్తారని ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement