పదిలమైన విజయాలకు.. ఫలితాలే సాక్షి | - | Sakshi
Sakshi News home page

పదిలమైన విజయాలకు.. ఫలితాలే సాక్షి

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

పోటీపరీక్షలకు సైతం.. ఆనందంగా ఉంది.. సులభంగా సాధన ఆత్మవిశ్వాసం రెట్టింపు

కవిటి: ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన సాక్షి మెటీరియల్‌ బాసటగా నిలిచింది. గణితం, సైన్స్‌ సబ్జెక్టులపై నిపుణులు ఆధ్వర్యంలో రూపొందించిన మెటీరియల్‌ను ఎంపిక చేసిన పాఠశాలలకు ఉచితంగా అందజేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు ప్రతిరోజూ సాక్షి దినపత్రికలోనూ సబ్జెక్టుల వారీగా పాఠాలు ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది సాక్షి స్టడీ మెటీరియల్‌ అందుకున్న పలు పాఠశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదుచేశాయి. కవిటి మండలం బొరివంక ఉన్నత పాఠశాల 95 శాతం, రాజపురం ఏపీ మోడల్‌ స్కూల్‌ 95 శాతం, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 90 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బొరివంక ఉన్నత పాఠశాలలో 26 మంది 550కు పైగా మార్కులు సాధించడం విశేషం. 51 మంది 500 మార్కులకు పైబడి తెచ్చుకున్నారు. కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని బాలక కాత్యాయని వరప్రసన్నకుమారి 591 మార్కులతో మండల టాపర్‌గా నిలవడం విశేషం. ఏపీ మోడల్‌ స్కూల్‌లో అంచనాలకు మించి 95 శాతం ఉత్తీర్ణత సాధించడం వెనుక సాక్షి స్టడీ మెటీరియల్‌ సహకారం ఎంతగానో ఉందని మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయ సిబ్బంది వివరించారు. ఉపాధ్యాయుల కృషి తోడు సాక్షి మెటీరియల్‌లో ప్రచురితమైన కంటెంట్‌, సులభమైన వివరణలు వల్ల పరీక్షలపై భయం పోయి ఉత్తమ మార్కులు సాధించగలిగామని పలువురు విజేతలు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

సాక్షి మీడియా ఇటీవల పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్‌ టెన్త్‌క్లాస్‌ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు బాగా సహకరించింది. వీటిని భద్రపర్చుకుంటే అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా వినియోగపడుతుంది. టీచర్ల సహకారం, సాక్షి మెటీరియల్‌తో ఉత్తమ మార్కులు సాధించగలిగాను.

– ఎం.ప్రేమ్‌కుమార్‌,

563 మార్కులు, ఏపీమోడల్‌ స్కూల్‌, రాజపురం

పదో తరగతిలో 591 మార్కులు సాధించి మండలం టాపర్‌గా నిలవడానికి సాక్షి స్టడీ మెటీరియల్‌ ఎంతగానో దోహదపడింది. నాలాంటి ఎందరో విద్యార్థులు అద్భుతమైన ఫలితాల సాధించడం వెనుక ఉపాధ్యాయులతో పాటు సాక్షి మెటీరియల్‌ సహకారం ఎంతగానో ఉంది.

– బాలక కాత్యాయని వరప్రసన్నకుమారి,

591 మార్కులు, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల

సరైన సమయంలో సాక్షిమీడియా స్టడీ మెటిరియల్‌ పంపిణీ చేసింది. ఉత్తమ మార్కుల సాధన చేసేలా ప్రేరణ కలిగించింది. టెక్స్‌బుక్స్‌, నోట్స్‌ పట్టుకుని కుస్తీ పట్టే పనిలేకుండా సులభంగా, సమగ్ర సమాచారంతో అన్ని విభాగాల్ని కవర్‌ చేస్తూ ప్రచురించిన స్టడీ మెటీరియల్‌తో 568 మార్కులు సాధించగలిగాను.

– మార్పు సమీక్ష, 568 మార్కులు, బొరివంక ఉన్నత పాఠశాల

సాక్షి మీడియా పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్‌ పరీక్షల ఒత్తిడిలో సతమతమవుతున్న మాలో సరికొత్త ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఉపాధ్యాయుల కృషికి తోడు అన్ని అంశాల్ని క్రోడీకరిస్తూ సిద్ధం చేసి ఇచ్చిన మెటీరియల్‌తో ఉత్తీర్ణత శాతం పెరిగింది. – బి.చందన,

534 మార్కులు, రాజపురం మోడల్‌ స్కూల్‌

మెరుగైన ఉత్తీర్ణత సాధించిన సర్కారు బడులు

సాక్షి మెటీరియల్‌ సహకారం మరువలేమంటున్న విజేతలు

ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు

Advertisement
 
Advertisement
Advertisement