భార్యపై దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

భార్యపై దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం

May 2 2026 12:01 PM | Updated on May 2 2026 12:01 PM

టెక్కలి రూరల్‌: స్థానిక ఆది ఆంధ్ర వీధికి చెందిన డి.రామకృష్ణ అనే వ్యక్తి తన భార్యపై దాడి చేసి.. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామకృష్ణ తన భార్య కృష్ణవేణి తాను చెప్పిన మాట వినలేదనే కోపంతో దాడి చేశాడు. అనంతరం తాను సైతం తన చేతిలో ఉన్న పదునైన కత్తిలో తన పీకను తానే కోసుకున్నాడు. దీంతో రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు భార్యాభర్తలు ఇరువురికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వివరాలు సేకరించారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడికి గాయాలు

రణస్థలం: లావేరు మండలంలోని బెజ్జిపురం జంక్షన్‌ ఎన్‌హెచ్‌–16పై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కెల్ల వెంకటేష్‌ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం నుంచి రణస్థలం వైపు వెళ్తున్న లగేజీ వ్యాన్‌ రోడ్డు పక్కన నిలిపి ఉంది. అదే సమయంలో వెనక వైపు నుంచి ద్విచక్ర వాహనంతో వచ్చిన వెంకటేష్‌ ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడు తల, కుడి చేయి, ఎడమ కాలికు బలమైన దెబ్బలు తగిలాయి. 108 వాహనంపై శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుడు పొందూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందినవాడు. దీనిపై లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement