సోంపేట: జిల్లాలోని తీరప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో కలిసి మత్స్య సాగరమాల ప్రాజెక్టు ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీరప్రాంత రోడ్ల అభివృద్ధి, 1,594 సోలార్ లైట్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.
అనంతరం ఎకువూరు గ్రామంలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. వారితో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు.


