ఖజానా శాఖ డీడీపై విచారణ | - | Sakshi
Sakshi News home page

ఖజానా శాఖ డీడీపై విచారణ

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో గడచిన నెల రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదాలు చినికిచినికి గాలివానగా మారుతున్నాయి. తాజాగా జిల్లా ఖజానా అధికారి, డీడీ రవికుమార్‌పై విచారణకు ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ఖజానా కార్యాలయంలో జేడీగా పనిచేస్తున్న వనజారాణిని విచారణ అధికారిగా నియమించారు. నెల రోజుగా ఈ శాఖలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఒకరిపై ఒకరు ఫిర్యాదు, పోలీస్‌ స్టేషన్‌లో రాజీలు చేసుకొన్నారు. ఇక్కడితో వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ శాఖలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసిన వ్యవహారంతో మళ్లీ ఈ వివాదాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారాలు ఖజానా శాఖ డైరెక్టరేట్‌కు చేరాయి. దీంతో ఈ వ్యవహా రంపై విచారణకు ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా వనజారాణి డీడీ రవికుమార్‌కు ఓ మెమో పంపించారు. కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అందజేయా లని ఆమె కోరారు. ఏటీఓ సెలవు లో ఉన్నప్పుడు ఆయన లాగిన్‌లోకి వెళ్లి కొన్ని బిల్లులు పాస్‌ చేయాల్సిన పరిస్థితులు, ఏడుగురు ఉద్యోగుల ను సస్పెండ్‌ చేయడం, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రాజీ చేయడం వంటి అంశాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement