ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు ‘ఢమాల్‌’ | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు ‘ఢమాల్‌’

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

హాజరైంది శాతం

అట్టడుగు స్థానాల్లో నిలిచిన సిక్కోలు

తరగతి పరీక్షలకు ఉత్తీర్ణులు ఉత్తీర్ణత

టెన్త్‌ 666 119 17.87

ఇంటర్‌ 1300 316 24.31

శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ) ఫలితాలు ఢమాల్‌ మన్నాయి. ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. టెన్త్‌, ఇంటర్‌లో జిల్లాలో దారుణమైన ఉత్తీర్ణత నమోదు కావడం అధికారులను సైతం కలవరపాటుకు గురిచేసింది. పదో తరగతి పరీక్షల్లో 17.87 శాతం, ఇంటర్‌ పరీక్షల్లో 24.31 శాతం ఉత్తీర్ణ తను నమోదు చేసి అట్టడుగు స్థానంలో నిలిచాయి.

10 తర్వాత మార్క్స్‌ మెమోలు పొందండి..

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల మార్క్స్‌ మెమోలు మే 10వ తేదీ తర్వాత వారివారి అభ్యసన కేంద్రాలో సంబంధిత హెచ్‌ఎం/ప్రిన్సిపాల్‌ ద్వారా పొందవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు తెలిపారు. అలాగే విద్యార్థులు రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా లేదా పేమెంట్‌ గేట్‌వే ద్వారాగాని నిర్దేశించిన ఫీజులు చెల్లించి మే 2 నుంచి 11వ వరకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement