ఈతరం విజేతలు
● ఆలిండియా స్కూల్‌గేమ్స్ సిమ్మింగ్ పోటీలకు ఎంపిక
● ఈ నెల 11 నుంచి ఢిల్లీలో మెగా టోర్నీ
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్విమ్మింగ్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారు. జాతీయ పోటీలకు ఎంపికై న వారిలో దీక్షా బెహరా, పి.ఇషాసంహిత ఉన్నారు. నవంబర్ మొ దటి వారంలో నరసారావుపేటలో 69వ ఏపీ రాష్ట్ర స్థాయి అండర్–17 స్విమ్మింగ్ చాంపియన్‌షిప్– 2026 పోటీల్లో వీరిద్దరూ అత్యద్భుతంగా రాణించి పతకాలు సాధించడంతో నేరుగా జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీల కోసం కఠోర సాధన చేస్తున్నారు.
ఢిల్లీలో జరగనున్న జాతీయ పోటీలు..
69వ ఆలిండియా నేషనల్స్ స్కూల్‌గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్నాయి. రాష్ట్రపోటీల్లో పతకాలు సాధించి రాణించడంతో ఆలిండియా స్కూల్‌గేమ్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున వీరిద్దరు ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయ పోటీలకు ఎంపికైన బాలికలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు సోమవారం అభినందించారు. జాతీయ పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించా రు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం. సాంబమూర్తి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య తదితరులు అభినందించారు.
పతకాల దీక్ష..
దీక్షా బెహర కేంద్రీయ విద్యాలయంలో పదోతరగతి చదువుతోంది. రాష్ట్రపోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ యువ స్విమ్మర్ 100 మీటర్స్, 50 మీటర్స్ ఫ్రీ స్టైల్‌లో రెండు బంగారు పతకాలు సాధించి శభాష్ అనిపించింది.
సరికొత్త కుసుమం..
పి.ఇషాసంహిత ఆర్‌సీఎం సెయింట్ జాన్స్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. రాష్ట్రపోటీల్లో 800 మీటర్ల ఫ్రీ స్టయిలోలో కాంస్య పతకం సాధించి సత్తాచాటింది.
ఈతరం విజేతలు
ఈతరం విజేతలు
ఈతరం విజేతలు


