ఎస్పీ గ్రీవెన్సుకు 62 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 62 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌కాల్ ద్వారా తెలియజేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదు లు పునరావృతం కాకూడదని, వాటిపై తీసుకున్న చర్యలపై నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు.


