నాలుగు పూరిళ్లు దగ్ధం
మందస: బుడారుసింగ్ పంచాయతీ పద్మపురంకాలనీ గిరిజన గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత వల్ల చెలరేగిన కార్చిచ్చు వల్ల నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో గిరిజనులకు పనులకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కొందరు స్థానికులు గుర్తించి మందస అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా.. అక్కడ సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో పలాస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే సవర లాలు, సవర ఉదయ్, సవర ఢిల్లీ, సవర నోబిల్‌కు చెందిన ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.


