8 నెలల నరకం
శ్రీకాకుళం క్రైమ్ : మరో అకృత్య కాండ వెలుగులోకి వచ్చింది. మన ఇంటి బిడ్డల భద్రతను ప్రశ్నిస్తూ ఇంకో కీచక పర్వం బయటపడింది. ఎనిమిది నెలల హింసను భరించిన ఓ బాలికకు ఎట్టకేలకు విడుదల లభించింది. కనిపెంచిన తల్లే కామాంధుని చెరలో చిక్కడం, నమ్మకం ఉంచిన ఆటో డ్రైవర్ కీచకుడిలా మారి వేధించడంతో ఆ బాలిక నరకం చూసింది. బంధువుల సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు ఈ శోకానికి తెర పడింది. జేఆర్ పురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ 14 ఏళ్ల అమ్మాయిని 8 నెలలుగా లైంగికంగా వేధిస్తున్నా డు. బాలిక తల్లితోనూ అక్రమ సంబంధం నడిపాడు. బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడైన డ్రైవర్‌ను, సహకరించిన బాలిక తల్లిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించా రు. శనివారం శ్రీకాకుళం సబ్‌డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..
బాలిక తండ్రి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఉదయం వెళ్లి రాత్రయితే గానీ ఇంటికి రారు. ఇంటి విషయాలేవైనా భార్యే చూసుకునేవారు. వారి కుమార్తెను అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావు వేరే గ్రామంలో ఉన్న హైస్కూల్‌కు తీసుకెళ్లేవాడు. బాలికతో పాటు మరో తొమ్మిది మంది కూడా అదే వాహనంలో స్కూల్‌కు వెళ్లేవారు. ఒకే ఊరు కావడంతో డ్రైవర్ బాలిక ఇంటికి వెళ్లి తల్లితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. అంతటితో ఆగక బాలికపైనా కన్నేశాడు.
మద్యానికి బానిస చేసి..
బాలిక తల్లిని మద్యానికి బానిస చేసి.. ఆమె మత్తు లో ఉండగా బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవా డు. ఆటోలో కూడా అదే రీతిలో బాలికను ఏడిపించేవాడు. తట్టుకోలేని బాలిక మొదట్లో తల్లితో చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఈ విషయం తండ్రితో చెప్పకూడదని బెదిరించేది. బాలిక తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడి ఎనిమిది నెలలు ఆ నరకం భరించింది.
తల్లి కొట్టడంతో..
ఈ క్రమంలో నాలుగు రోజుల ముందు బాలికను స్కూలుకు దిగబెట్టే క్రమంలో డ్రైవర్ రామారావు దారిలో ఆటో ఆపేసి లైంగికదాడికి యత్నించాడు. ఎంత వద్దన్నా వినిపించుకోలేదు. ఇంటికొచ్చి తల్లితో చెబితే బాలికనే తిరిగి కొట్టడంతో.. రాత్రి విధుల నుంచి వచ్చిన తండ్రితోను, ఎదురింటిలో ఉన్న చిన్నాన్న, పిన్ని, మామయ్యలతో ఆమె విషయమంతా చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయగా డీ ఎస్పీ వివేకానంద దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, తాను వచ్చాక 15 కేసులు నమోదయ్యాయన్నారు. పోక్సో కేసులో డ్రైవర్‌కు వర్తించిన జైలు శిక్ష ఆమెకు కూడా పడవచ్చన్నారు.
8 నెలల నరకం


