డైట్‌లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: వమరవల్లి డైట్ శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న మూడు సీనియర్ లెక్చరర్, 8 లెక్చరర్ పోస్టులు డిప్యుటేషన్‌పై భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధి కారి ఎ.రవిబాబు తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తులను గూగుల్ ఫారంలో స్వీకరించారని, ఇకమీదట లీప్ యాప్ ద్వారా స్వీకరిస్తారని అన్నారు. గతంలో గూగుల్ యాప్‌లో దరఖాస్తు చేసుకున్న వారు సైతం మళ్లీ లీప్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తును పూర్తి చేసి అన్ని సర్టిఫికెట్ల నకళ్లను జతచేసి డీడీఓ ద్వారా జిల్లా డైట్ కార్యాలయంలో అందించాలన్నారు. ఈనెల 31వ తేదీ నాటికి 58 ఏళ్లు నిండని వారు, సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం, ఎంఈడీలో 55 శాతం మార్కులు పొందిన వారు అర్హులని పేర్కొన్నా రు. రెండు సబ్జెక్టులలో అర్హత కలిగి ఉంటే రెండింటికి ఒక దరఖాస్తులో మాత్రమే పొందుపరచాలని సూచించారు. గతంలో ఎఫ్‌ఎస్‌టీసీ, డైట్లలో పనిచేసిన వారు అనర్హులని, ఎంపికై న ఉపాధ్యాయులు ఒక ఏడాది కచ్చితంగా డైట్ లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆరు విడతల్లో పరీక్షలు జరుగుతాయని, నవంబర్ 14, 15 తేదీల్లో త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూ చేస్తుందని పేర్కొన్నారు.
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం అనే అంశంపై ఆదివా రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక నాయకులు గుంటి గిరిధర్, కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలోని యూటీఎఫ్ భవనంలో ఈ సమావేశం ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాల ని కోరారు.
శ్రీకాకుళం రూరల్ : జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు, జిల్లాకు చెందిన 22 బస్సులను స్థానిక విజయాదిత్య పార్క్ వద్ద ఆపి తనిఖీలు జరిపారు. సంబంధిత పత్రాలు సరిగ్గానే ఉన్న ట్లు గుర్తించారు. జిల్లాకు సంబంధించి ప్రైవేటు ట్రావెల్స్ గల 18 బస్సులకు స్టేట్ పర్మిట్లు, ఒక బస్సుకు ఆలిండియా పర్మిట్ ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం డీటీసీ విజయసారధి తెలిపారు. తనిఖీలు చేసిన బస్సులకు ఫైన్‌లు గాని, సీజ్ చేయడం గాని జరగలేదన్నారు.


