వైద్య కళాశాలలను ప్రజలే రక్షించుకోవాలి
పలాస: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంజూరు చేయించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రజలే రక్షించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మూడో వార్డు పద్మనాభపురం గ్రామంలో శనివారం సాయంత్రం రచ్చబండ, కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి పేదవాడికి వైద్య విద్య చేరువ చేయాలని వైఎస్ జగన్ ఆలోచిస్తే.. కూటమి ప్రభు త్వం పేదలకు వైద్య విద్య దూరం చేస్తోందన్నారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిష్టు గోపి ఆధ్వర్యంలో మూడో వార్డు కౌన్సిలర్ సవర సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీ పీ నాయకులు డొక్కరి దిలీప్‌కుమార్, బదకల బాల మ్మ, రంది రాజారావు, డిక్కల రాంబాబు, కుమ్మరి బోగేషు, కిక్కర ఆధినారాయణ, కొండే రాజారావు, బడగల బల్లయ్య, బోరబుజ్జి, గుజ్జు జోగారావు, నర్తు వెంకటరమణ, తూముల శ్రీనివాసరావు, కంచరాన చినబాబు, బమ్మిడి సంతోష్‌కుమార్, సనప ల సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


